ఇక క్యాన్సర్‌ ఖతం


Sun,October 13, 2019 01:04 AM

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : క్యాన్సర్‌ వ్యాధి.. భయంకరమైన మహమ్మారి. ఒకసారి సోకిందంటే పరిస్థితి నరకప్రాయమే.. అదే ముందే గుర్తిస్తే క్యాన్సర్‌ నుంచి బయ ట పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు చేపట్టగా.. అదే కోవలో తాజాగా క్యాన్సర్‌ పరీక్షలను చేసేందుకు నిర్ణయించింది. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలో 12 జిల్లాలను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లా సైతం ఎంపికైంది. క్యాన్సర్‌ ప్రా రంభ దశలో ఉన్న వారికి ఈ పరీక్షల వల్ల ఎంతో మేలు చేకూరనున్నది. జిల్లాలో మహిళల్లో గర్భాశ య, రొమ్ము క్యాన్సర్‌ సమస్యలు ఎక్కువగా ఉండ గా.. పురుషుల్లో లంగ్‌ క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌ ఎక్కువగా వస్తోంది. వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఇంటింటికీ తిరిగి నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. రొమ్ము, నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ప్రొ స్టేట్‌ క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, లంగ్‌ క్యాన్సర్‌.. ఇలా అనేక క్యాన్సర్లు ప్రాణాలను హరిస్తున్నాయి. క్యాన్సర్‌ సోకినట్లు ముందే గుర్తిస్తే ప్రారంభ దశలోనే వారికి వై ద్యం అందించి నయం చేసేందుకు అవకాశం ఉం ది. అందుకే ప్రభుత్వంచేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా మారనుంది.

క్యాన్సర్‌ భూతాన్ని తరిమేసేందుకు..
క్యాన్సర్‌ భూతాన్ని తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మృత్యువు వెంటాడుతున్నట్లే అనిపిస్తుం ది. ఇదంతా కేవలం అవగాహన రాహిత్యం వల్లే. ఎలా వస్తుందో.. ఎందుకు వస్తుందో కూడా చాలా మందికి తేలీదు.. క్యాన్సర్‌ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే.. ప్రారంభ దశలో గుర్తిస్తే ఆ మహమ్మారిని తరిమికొట్టడం తేలిక. ఇక పేదల్లో కనీసం వైద్యశాలకు వెళ్లి క్యాన్సర్‌ పరీక్షలు చేసుకునాలనే ఆలోచనేఉండదు. ఆలోచన ఉన్నా పేదరికం వల్ల సాధ్యం కాకపోవచ్చు. వీటిన్నింటినీ గుర్తించిన తెలంగాణ సర్కారు క్యాన్సర్‌ మహమ్మారిపై పోరుకు సిద్ధమైం ది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఇంటింటికీ తిరిగి క్యాన్సర్‌ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో క్యాన్సర్‌ పరీక్షలను మరింత జాగ్రత్తగా నిర్వహించేందుకు సర్కా రు ప్రయత్నిస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా సైతం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైంది. జిల్లాలోని 30 ఏళ్లకు పైబడిన వారందరికీ క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్‌ మాసంలో ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు మహిళల్లో క్యాన్సర్‌ వచ్చే
అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు మహిళలను వేధిస్తున్నాయి. నోరు, ముఖద్వార, ఊపిరితిత్తులు, జీర్ణాశయ క్యాన్సర్లు పురుషుల్లో ఎక్కువగా వస్తున్నాయి. అనవంశికంగా వచ్చే జన్యువుల 10 శాతం క్యాన్సర్లకు కారణమైతే.. మిగిలిన 90 శాతం క్యాన్సర్లు రావడానికి జీవనశైలే కారణం. ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, వైరస్‌లు సోక డం, ప్లాస్టిక్‌ వాడకం, రేడియేషన్‌, ధూమపానం, మనోవ్యాకులత, క్రిమిసంహాకర పదార్థాల ప్రభా వం, ఊబకాయం, ఈ ప్రాణాంతక క్యాన్సర్‌ వస్తుం ది. జిల్లాలో ధూమపానం ఎక్కువగా ఉంటుంది. దీంతో లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. అలా గే గుట్కాల వల్ల నోటి క్యాన్సర్‌ సోకుతుంది. ప్యాకిం గ్‌, కలర్డ్‌ ఫుడ్‌ సైతం క్యాన్సర్‌ కారకాలే.

పరీక్షలు నిర్వహించే విధానం
ఇప్పటికే శిక్షణ పొందిన వైద్య బృందం ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. వారానికి 5 రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షలు చేసిన తర్వాత ప్రతి వ్యక్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారు. నోటిలో పుండ్లు, తెల్ల మచ్చలు, ఎక్కువ కాలం పొగాకు ఉత్పత్తులు వాడిన వారి వివరాలు నమోదు చేసుకుంటారు. మహిళల్లో ప్రత్యేక పద్ధతి ద్వారా రొమ్ము పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమికంగా క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నవారిని సమీప పీహెచ్‌సీకి తరలిస్తారు. ఇక గర్భాశయ ముఖద్వార క్యా న్సర్‌ పరీక్షల కోసం పీహెచ్‌సీలోని శిక్షణ పొందిన వైద్యబృందం నిర్వహిస్తారు. తర్వాత దశలో క్యా న్సర్‌ నిర్ధారణ అయిన వారికి వైద్యం అందిస్తారు.

మారుతున్న జీవన విధానం వల్లే...
మారుతున్న జీవన విధానమే సమస్త రోగాలకు కారణం. గుట్కాలు తినడం వల్ల గొంతు సంబంధ క్యాన్సర్‌ వస్తోంది. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స అందించవచ్చు. జీవన విధానంలో ఫాస్ట్‌ ఫుడ్‌, పిజ్జా బర్గర్లు, ప్యాకింగ్‌ ఫుడ్‌, రసాయనిక పదార్థాలు కలిసిన ఆహారం వల్ల అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే జీవన విధానం సక్రమంగా ఉండేలా చూడాలి. ప్రభు త్వం పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ ద్వారా క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందిస్తు న్నాం. ప్రభుత్వ జనరల్‌ దవాఖానాలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ సెంటర్‌లో రోగులకు పరీక్షలు చేస్తాం.
- డాక్టర్‌ రాంకిషన్‌, సూపరింటెండెంట్‌, జనరల్‌ దవాఖాన


పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌లో ఇప్పటికే..
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ జనరల్‌ దవా ఖా నలోని పాలియేటివ్‌ కేర్‌సెంటర్‌లో వైద్యం అందిస్తున్నాం. ఇందులో 90 శా తం మందిక్యాన్సర్‌ రోగులే. సర్వైకల్‌, ఓరల్‌, బ్రెస్ట్‌, లంగ్‌ క్యాన్సర్‌ రోగులు ఎక్కువగా వస్తారు. ఏటా రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇందుకోసం 8 ప డకల యూనిట్‌ను ప్రభుత్వంఏర్పాటు చేసింది. క్రమం తప్పకుం డా వైద్యం అందిస్తున్నాం. అలాగే నిత్యం 15 మంది క్యాన్సర్‌ రోగులను ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తాం. - డాక్టర్‌ జ్యోతి, పాలియేటివ్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జనరల్‌ దవాఖాన

ముందే గుర్తించడం వల్ల ఎంతో ప్రయోజనం...
ప్రభుత్వం మహబూబ్‌ నగర్‌ జిల్లాను సైతం పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా చేర్చింది. ఎప్పటి నుంచి క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించే విషయంపై ఇంకా మాకు ఆదేశాలు రాలేదు. కానీ క్యాన్సర్‌ పరీక్షలను నిర్వహించడం ఎంతో ప్రయోజనకరం. ముందే గుర్తించి వారికి అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వమే అన్ని రకాలుగా వారికి వైద్యసాయం అందిస్తుంది.
- డాక్టర్‌ రజనీ, జిల్లా వైద్యాధికారి, మహబూబ్‌నగర్‌

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...