మహబూబ్‌నగర్‌ మున్సిపాల్టీని ఆదర్శంగా తీర్చి దిద్దాలి


Sun,October 13, 2019 01:02 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ మున్సిపాల్టీని ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో 30 రోజుల ప్రణాళిక అమలు పర్చేందుకు జిల్లా అధికారులతో శనివారం హైదరాబాదులో రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌ నగర్‌ మున్సిపాల్టీలో ఈనెల 14 నుంచి 30 రోజుల ప్రణాళికా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణకు సంబంధించి అధికారులతో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టవలసిన కార్యాచరణపై అధికారులతో చర్చించారు. ఒక ప్రణాళిక ప్రకారం పట్టణ అభివృద్ధి జరగాలని, ప్రజల అందరి భాగస్వామ్యంతో పట్టణ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించాలన్నారు. అందుకు సంబంధించి వార్డుల్లో ప్రణాళిక అమలు పర్చుటకు వార్డు పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. 30 రోజుల ప్రణా ళికలో భాగంగా పట్టణ అన్ని జంక్షన్ల అభివృద్ధి సుందరీ కరణ, పట్టణ సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం, పారిశుధ్యం, వార్డు అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రోడ్డు విస్తరణ పనులతో పాటు ప్రతి సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని తెలిపారు. ఈనెల 14 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రతి వార్డుకు ఒక జిల్లా స్థాయి అధికారి, ఒక మున్సిపల్‌ సిబ్బంది నియమించా మన్నారు. దీంతోపాటు ఇతర శాఖలు విద్యుత్‌శాఖ, అటవీశాఖ, డీఆర్‌డీవో, రోడ్డు మరియు భవనాల శాఖ, మెప్మా వారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వడ్డె సురేందర్‌, జిల్లా అధికారులు పబ్లిక్‌ ఎస్‌ఈ దేవానంద్‌, ఈఈ విజయభాస్కర్‌రెడ్డి, నేషనల్‌ హైవే ఈఈ శ్రీనివాస్‌, డిప్యూటీ ఈఈ రవీంద్రకుమార్‌, డీఈ సంజీవరెడ్డి, మున్సిపల్‌ ఎంఈ సత్యనారాయణ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం..
మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తా : అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వ పథకాలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు. శనివారం తన నివాసంలో మహబూబ్‌నగర్‌ మండలం, కోడూర్‌ గ్రామానికి చెందిన గూడెం నర్సిములు చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్‌వోసీని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరికి ఏ ఆపద వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాండు రంగారెడ్డి, కోడూరు గ్రామ నాయకులు నర్సిములు పాల్గొన్నారు.

సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం
మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యం ఉంటేనే నిండు జీవితం తమ సొంతం అవుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మహబూబ్‌నగర్‌ నియోజక వర్గంలోని హన్వాడ మండలం వేపూర్‌ గ్రామానికి చెందిన మితాన్స్‌కు రూ. 2 లక్షలు, టంకర గ్రామానికి చెందిన మంజుల రూ.1 లక్ష వైద్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అందజేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందు బాటులో ఉంచుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ దవాఖానల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందు బాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరుణాకర్‌ గౌడ్‌, ఖాజా తదితరులు ఉన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...