సజావుగా.. ప్రయాణం


Sun,October 13, 2019 01:02 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : ప్రశాంతమైన వాతావారణంలో యాదావిధిగా ఆర్టీసీ ప్రయాణాలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన ఆ సమస్యనే తెలియకుండా ఆర్టీసీ, డీటీసీ అధికారులు తీసుకున్న నిర్ణయాలు సంపూర్ణ ఫలితాలు వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ అధికారులపై కూడా అధికంగా పనిభారం పడింది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ శాఖల నుంచి కొంత మంది అధికారులను కేటాయించి తాత్కాలికంగా ఆర్టీసీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌కు సూచించారు. ఈ మేరకు మహబూబ్‌నగర్‌ రీజియన్‌కు జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ 11 మంది ఇతర శాఖల నుంచి తాత్కాలికంగా పని చేసేందుకుగానూ ఆర్టీసీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 11 మంది వివిధ డిపోలలో విధులు నిర్వహించేందుకు డీవీఎం వెంకటరమణ అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవ డంతో ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు లేకుండా పోయింది. గతంలో పలుమార్లు ఆర్టీసీ అధికారులు సమ్మె చేసిన సమయంలో ప్రయాణికుల ఇబ్బందులు కోకొల్లలు. ఈ క్రమంలో గత అనుభవాలను పరిగణన లోకి తీసుకొని ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ఆర్టీసీ కార్మికులు లేని లోటు తెలియకుండా తాత్కాలిక సిబ్బందితో ప్రయాణం సాఫీగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో ప్రయాణాలు ప్రశాంతమైన వాతావారణంలో కొనసాగుతున్నాయి.

17 వేల మందికి పైగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ
ఆర్టీసీ, డీటీసీ అధికారులు సమయన్వంతో పని చేస్తూ బస్సులను నడిపించడంతో అధికారులు ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా పక్కా ప్రణాళికలతో ప్రతి రోజు బస్సులను నడిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 68 ఆర్టీసీ, 32 హైర్‌, 70 ప్రైవేటు బస్సులను ప్రజలకు ఆర్టీసీ, డీటీసీ అధికారులు సంయుక్తంగా అందు బాటులో ఉంచారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సులు పూర్తిగా అందుబాటులోకి రావడంతో అధికారులు ప్రయాణి కులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మేరకు జిల్లాలో దాదాపు 17 వేలకు పైగా ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. పాలమూరు రీజియన్‌కు 11 మందిని వివిధ శాఖల నుంచి కేటాయించారు. వీరిని అవసరమైన చోట ఆర్టీసీ అధికారులు సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకు న్నారు. ఆర్టీసీ అధికారులు కేటాయించిన అధికారులకు ఆర్టీసీ విధి నిర్వహణ పనులు నేర్పిస్తూ చేయాల్సిన పనుల గురించి అవగాహన కల్పిస్తూ ఆర్టీసీ విధులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...