ప్రగతి సూపర్


Sun,September 22, 2019 02:50 AM

-ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు
-శ్రమదానానికి స్వచ్ఛందంగా కదిలిన జనం
-విద్యుత్ వైర్లను సరిచేస్తూ మున్ముందుకు..
-పల్లె ప్రగతితో ఎన్నో సమస్యల పరిష్కారంలలో పర్యటించారు.

11:20 గంటలకు శ్రమదానం
ఉదయం 11:20 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి కమిటీ సభ్యులు కార్యక్షేత్రంలోకి వచ్చారు. గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం శ్రమదానం చేశారు. పంచాయతీరాజ్ రోడ్డుకిరువైపులా మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:10 గంటలకు భోజన విరామం ప్రకటించారు. 2:20 గంటలకు తిరిగి పనిలో నిమగ్నమయ్యారు. కాటవరం, తండాలోని పలు వార్డులలో పర్యటించారు. సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ శ్రీనివాసులుగౌడ్, కోఆప్షన్ సభ్యులు దేవుజీ, మాధవి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులు తండాలో వీధులు, రోడ్లు, మంచినీటి ట్యాంకులు, ఇండ్లలో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకున్నారు. కమిటీల సభ్యులు వార్డుల వారీగా విభజించుకుని పనులను చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్వేత, ప్రత్యేకాధికారి విజయ కుమారి, కో ఆప్షన్ సభ్యులు బనదీశ్వర్‌లు వాటర్ ట్యాంకులు, ఇంకుడు గుంతల పరిశీలించారు. వీధి దీపాలను క్రమబద్ధీకరించారు. పాత స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. సాయత్రం 4 గంటలకు తమ పనులు ముగించుకున్న యువకులు, మహిళలు, కమిటీ సభ్యులు, అధికారులు ఇండ్లకు పయనమయ్యారు.

1:10 గంటలకు భోజన విరామం
మధ్యాహ్నం 1:10 గంటలకు భోజన విరామం తీసుకున్నారు. కమిటీ సభ్యులు, యువకులు ఎవరి ఇండ్లకు వారు వెళ్లి భోజనం చేశారు. అనంతరం 2:20 గంటలకు తిరిగి పనిలో నిమగ్నయమ్యారు.

రిక్షాపై చెత్త సేకరణ
గ్రామంలోని చెత్తను రిక్షాపై సేకరించి డంపింగ్ యార్డులలో వేశారు. పారిశుధ్యం పనులలో భాగంగా గ్రామంలోని చెత్త, గడ్డిని రిక్షాలో వేసుకుంటూ గ్రామంలోని వీధులలో విజిల్ వేసుకుంటూ చెత్తను సేకరించి అనంతరం డంపింగ్ యార్డులో వేశారు.

గుట్టలలో విజిల్
గ్రామంలోని నరసింహ గుట్టపై నాటిన మొక్కలను కాపాడుకోవడానికి ఇద్దరు వ్యక్తులను నియమించారు. వీరు మొక్కలకు నీరు పోయటంతోపాటు మేకలు మేయకుండా విజిల్ వేసుకుంటూ గుట్టలపై తిరుగుతుంటారు. హరితహారంలో భాగంగా గ్రామంలో ఇప్పటి వరకు 32 వేల మొక్కలను నాటారు. శనివారం ఒక్కరోజే 12 వందల మొక్కలను రోడ్లకు ఇరువైపులా నాటారు.

ట్రీగార్డుల విరాళం
రోడ్లుకు ఇరువైపులా మొక్కలు నాటేందు కోసం పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కాటవరం తండాకు చెందిన జే.గోపాల్ 50 ట్రీగార్డులు, ఈ.గోపాల్ నాయక్ 50, బుచ్చిరెడ్డి 100 ట్రీ గార్డులను ఉచితంగా అందించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...