పెద్దవాగుపై తాత్కాలిక బ్రిడ్జి నిర్మించండి


Sat,September 21, 2019 12:32 AM

-గౌరిదేవిపల్లి రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే ఆల
అడ్డాకుల : మండలంలోని గౌరిదేవిపల్లికి ప్రజలు రాకపోకలు సాగించేందుకు కందూరు పెద్దవాగుపై తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పెద్దవాగులో కృష్ణాజలాల ఉధృతికి గురువారం గౌరిదేవిపల్లికి వెళ్లే రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల శుక్రవారం కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. గతంలో వాగు పారేది కాదని, కొమిరెడ్డిపల్లి నుంచి గౌరిదేవిపల్లికి ఒకే రోడ్డు మార్గం ఉందని, అది కాస్త నీటి ఉధృతికి తెగిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో శాశ్వతంగా దారి ఉండేలా బ్రిడ్జిని నిర్మించాలని విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. త్వరితగతిన తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నా రు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ గ్రామానికి వెళ్లే రోడ్డును పరిశీలించారు. వాగులో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వి విధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...