యూరియా ఆగయా


Sun,September 15, 2019 02:44 AM

-ఉమ్మడి జిల్లాకు 1,200 టన్నుల రాక
-జడ్చర్ల స్టాక్ పాయింట్ చేరిన బస్తాలు
-ఇన్‌చార్జి రాంపాల్ వెల్లడి

జడ్చర్ల : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 1,200 టన్నుల యూరియా శనివారం జడ్చర్ల రేక్ పాయింట్‌కు వచ్చింది. మద్రాస్ ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన విజయ్ యూరియాతో పాటు 17.17.17 కాంప్లెక్స్ ఎరువు శనివారం జడ్చర్ల రేక్ పాయింట్‌కు వచ్చింది. జడ్చర్లకు వచ్చిన యూరియాలో మహబూబ్‌నగర్ జిల్లాకు 300 టన్నులు, నాగర్‌కర్నూల్ జిల్లాకు 100 టన్నులు, వనపర్తి జిల్లాకు 400 టన్నులు, గద్వాల జిల్లాకు 400 టన్నులు పంపిణీ చేశారు. అదేవిధంగా 257 టన్నుల 17.17.17 కాంప్లెక్స్ ఎరువును మార్క్‌ఫెడ్‌కు తరలించినట్లు రేక్ పాయింట్ ఇన్‌చార్జి రాంపాల్ తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...