ప్రతి సమస్యనూ పరిష్కరించాలి


Sun,September 15, 2019 02:41 AM

భూత్పూర్ : గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. శనివారం భూత్పూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, అధికారులతో 30రోజుల ప్రణాళికపై నిర్వహించిన సమావేశానికి కలెక్టర్‌తోపాటు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాల్లో సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. గతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండగా, ఇప్పుడు ఆ సమస్యను మిషన్ భగీథ పథకానికి ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు. తాగునీటితో పాటు విద్యుత్ సమస్య కూడా తగ్గిందన్నారు. మిగిలిన సమస్యల పరిష్కారంపై సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ప్రతి గ్రామానికి జనాభాకు అనుగుణంగా నిధులు మంజూరవుతాయని తెలిపారు. ఒక్క భూత్పూర్ మండలానికే ఏడాదికి రూ.4కోట్లు పరిశు ధ్యం కోసం మంజూరవుతాయని, ఉపాధి హామీ పథకం ద్వారా అదనంగా మరో రూ.5కోట్ల వరకు మంజూరవుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పనులపై నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...