పీయూలో ఖోఖో బాలికల జట్ల ఎంపిక


Sat,September 14, 2019 03:15 AM

పాలమూరు యూనివర్సిటీ: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పరిధిలోని అంబేద్కర్ విశ్వ విద్యాలయం శ్రీకాకుళంలో నిర్వహించే బాలికల ఖోఖో టోర్నీకి పాలమూరు విశ్వ విద్యాలయం పరిధిలోని విద్యార్థులచే ఖోఖో టీంలను ఎంపికచేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డా.ఎన్.కుమారస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన ఎంపికలకు వచ్చిన విద్యార్థులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు జి కృష్ణమ్మ, ఎ కృష్ణవేణి, జి పద్మ, ఎం భూమిక, ఎం అశ్విని, బి శ్రీలత, సీహెచ్ కల్పన, బి లిఖిత, బి రాధిక, జి శ్రీలత, జి అనిత, ఎల్ మంగమ్మ, ఎస్ శివలీల, రజిత, స్వరూప, సంగీతను ఎంపిక చేశారు. పీయూ ఫిజికల్ డైరెక్టర్ బాల్‌రాజ్‌గౌడ్, ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ డైరెక్టర్ డేవిడ్, సత్యభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రయ్య, కవిత, మేరి పుష్ప, స్వాతి, భారతి పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...