మిడ్జిల్‌లో కేంద్ర బృందం పర్యటన


Sat,September 14, 2019 03:13 AM

మిడ్జిల్: మండలంలోని మల్లాపూర్‌లో కేంద్ర బృందం సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి పర్యటించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మరుగుదొడ్లు నిర్మాణం, తాగునీటి సమస్య, హరితహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలు, వాటి వినియోగంపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వ పనులను పరిశీలించారు. జలశక్తి అభియాన్ పథకం కింద జరుగుతున్న పనులు తెలుసుకున్నారు. రైతులు వ్యవసాయ పొలంలో నీటినిల్వ గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, పొలంగట్ల వద్ద చెట్లను పెంచాలని సూచించారు. పత్తిపంట, వరి పంటల దిగుబడి వివరాలు, గిట్టుబాటు ధరలు, రైతులకు అందుతున్న సదుపాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, సర్పంచ్ జంగారెడ్డి, ఎంపీడీవో సాయిలక్ష్మి ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...