పరుగు పరుగున పెద్దవాగుకు..


Sat,September 14, 2019 03:13 AM

- పారుతున్న కృష్ణాజలాలు.. రైతుల హర్షం
మూసాపేట: పెద్దవాగులో కృష్ణమ్మ పారుతూ దిగువకు బిరబిరా పరుగులు పెడుతోంది. కేఎల్‌ఐ ఎత్తిపోథల పథకంలో భాగంగా దిగువనున్న కృష్ణానది నుంచి వరద నీటినీ తొడిపోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషితో ఘనపూర్ బ్యాలెన్సింగ్ కెనాల్ నుంచి పిల్లివాగు ద్వారా పెద్దవాగుకు కృష్ణా జలాలు దిగువకు వస్తున్నాయి. మూసాపేట మండలంలోని మహ్మద్‌హుస్సేన్‌పల్లి, నిజాలపూర్‌లోని చెరువులను నింపుతూనే పెద్దవాగులోకి వరద నీళ్లు వస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే మూసాపేట వాగులో నిజాలపూర్ దిండు నుంచి దిగువకు కృష్ణా జలాలు పరుగుపరుగున వస్తున్నాయి. మధ్యరాత్రి వరకు నిజాలపూర్ వంతెన దాటి దిగువకు వచ్చే అవకాశం ఉంది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...