ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి


Thu,September 12, 2019 03:41 AM

-జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి
చిన్నచింతకుంట : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని పర్ధీపూర్, దమగ్నాపూర్ గ్రామాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పల్లెల ప్రగతి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, హరితహారం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రస్తుత సీజన్‌లో వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు నీటిని నిల్వ ఉండకుండా చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి భాగస్వామ్యంతో గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి రాము, సర్పంచులు కోట సుప్రియ రాము, గౌని హన్మంతురెడ్డి, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...