దోస్తరదీన్‌


Wed,September 11, 2019 01:14 AM

-జిల్లాలో భక్తిశ్రద్ధలతో పీర్ల పండుగ
-ఆకట్టుకున్న పీర్ల సవారి, అలాయ్‌ బలాయ్‌
-భక్తులతో కిక్కిరిసిన కోయిలకొండ పురవీధులు
-బీబీ ఫాతిమాను దర్శించుకున్న వేలాది భక్తులు
-బందోబస్తున్న పరిశీలించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
కోయిలకొండ: కోయిలకొండ భీమమ్మ జాతర జనసంద్రోహంగా మారింది. సోమవారం రాత్రి నుంచి మండల కేంద్రంలో విధులన్నీ జనంతో కిక్కిరిపోయాయి. మంగళవారం తెల్లవారు జామున ప్రభుత్వం నుంచి అమ్మకు సర్కార్‌ శక్కర అందించిన అనంతరం బీబీ ఫాతీమా పీరును ఖిల్లా కోట పైనుంచి ఊరేగింపునకు తరలించారు. పాతపోలీస్‌స్టేషన్‌ ముందు నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం బీబీ పాతీమా పీరును చుట్టూ గ్రామాల్లో ప్రతిష్ఠించిన పీర్లు సవార్లతో వచ్చి దర్శించుకొన్నాయి.బీబీ ఫాతీమా భర్త మొగులాలీ యుద్ధం తర్వాత వీరమరణం పొందారని డాల్‌సాబ్‌ బీబీ ఫాతమాకు తెలిపే సందర్భంగా పీర్ల పండుగలో అకట్టుకొంది. సాయత్రం బీబీ ఫాతీమా పీరుతోపాటు ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన పీర్లు నిమజ్జనానికి తరలించడంతో మొహర్రం ముగిసింది.

బీబీ ఫాతీమాను దర్శించుకొన్న ఎంపీ, ఎమ్మెల్యే
ఖిల్లాకోటపై ప్రతిష్ఠించిన భీబీ ఫాతీమా పీరును ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణలో కోయిలకొండ మొహర్రం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని.. ఖిల్లా కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. సందర్భంగా నిర్వాహకులు ఎంపీ, ఎమ్మెల్యేను సత్కరించారు.

బందోబస్తు పరిశీలించిన ఎస్పీ
మొహర్రం బీబీ ఫాతీమా ఉత్సవాలో ఏర్పాటు చేసిన బందోబస్తును ఎస్పీ రెమారాజేశ్వరి పరిశీలించారు. అగ్నిగుండం, పీర్ల ఊరేగింపు వివరాలను ఎస్సై సురేష్‌ను అడిగి తెలుసుకొన్నారు.లక్షకు పైగా భక్తులు దర్శించుకొన్నారని తెలిపారు. ఏర్పాట్ల కల్పనపై స్థానిక సర్పంచ్‌ కృష్ణయ్య,ఎస్‌ఐ సురేష్‌, పోలీసులను ఎస్పీ అభినందించారు.

ఊట్కూరులో వైభవంగా పీర్ల సవారీ
ఊట్కూర్‌ : యుద్ధంలో వీర మరణం పొందిన ప్రవక్త మనువలు హసన్‌, హుసేన్‌ త్యాగానికి గుర్తింపుగా జరుపుకునే మొహర్రం (పీర్ల పండుగ ) ఉత్సవ వేడుకలకు భక్తజనం పోటెత్తింది. మండల కేంద్రంలో మంగళవారం దశమి సవారీని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుల, మతాలకతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చక్కెర, పుట్నాలు, గోదుమ పిండితో తయారు చేసిన పాయసంను (మలీజా) భక్తులు హసన్‌, హుసేన్‌లకు నైవేద్యంగా సమర్పించుకున్నారు. మరి కొందరు గొర్రెలు, మేకలతో కందూర్లు నిర్వహించారు. పెద్దపీర్ల మజీదు నుంచి మేన్‌బజార్‌, భరత్‌నగర్‌, శివాజీనగర్‌ ప్రాంతాల మీదుగా కొనసాగిన ఊరేగింపు నిర్వహించారు.

వైభవంగా డోలారోహణం
పీర్ల సవారీలో ప్రధాన ఘట్టమైన డోలారోహణం (తొట్ల )మంగళవారం ఉదయం, సాయంత్రం వేళ వైభవంగా నిర్వహించారు. స్థానిక రుద్రనగర్‌లో ఆరెకటిక వంశస్తుల పిల్లలను ఊయల వేశారు. సవారీ చేత పిల్లలకు నామకరణం చేయించారు. రాత్రికి స్థానిక పెద్ద చెరువు అలుగు కట్టపై పీర్ల అలయ్‌ బలయ్‌ కలియతో నిర్యాణపు వేడుకకు ముగింపు పలికారు. నారాయణపేట ఎస్పీ డాక్టర్‌ చేతన భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ శ్రీధర్‌, మక్తల్‌ సీఐ వెంకట్‌, ఎస్సై ఎంఏ రషీద్‌ బందోబస్తు నిర్వహించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...