ఎనిమిది డీజేలు సీజ్‌


Wed,September 11, 2019 01:07 AM

-పోలీసుల అదుపులో సంబంధిత వ్యక్తులు
-బాధ్యులను కోర్టులో హాజరు పరుస్తాం
-టూటౌన్‌ సీఐ శ్రీనివాసాచారి
మహబూబ్‌నగర్‌ క్రైం : జిల్లా కేంద్రంలో డీజేలను పోలీస్‌ టాస్క్‌ పోర్సు బృందం సీజ్‌ చేసినట్లు టూటౌన్‌ సీఐ శ్రీనివాసాచారి తెలి పారు. మంగళవారం పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వేస్టేషన్‌ ప్రాంతం నుంచి రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న 8 డీజేలను టూటౌన్‌ సీఐ సీజ్‌ చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద భరిత స్థాయిలో శబ్దాలు చేసే డీజేలకు వేడుకలలో అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీజేలను స్వాధీనం చేసుకొని కోర్టుకు పంపుతామని సీఐ తెలిపారు. నిమజ్జన వేడుకల్లో ఎట్టి పరిస్థితుల్లోను డీజీల వినియోగం లేదని, నిబంధనలకు వ్యతిరేకంగా డీజేలను పెడితే అట్టి వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ పోలీసు అధికారులు తనిఖీ చేపట్టగా స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌,బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డీజేలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...