బొజ్జ గణపయ్యకు నిత్య పూజలు


Tue,September 10, 2019 01:00 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ/జడ్చర్ల టౌన్ : వినాయక చవితిని పురస్కరించుకొని కొలువుదీరిన గణనాథుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. సో మవారం జిల్లా వ్యాప్తంగా గణనాథుడికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. బాదేపల్లిలోని ఎర్రసత్యం కాలనీ లో వినాయక మండపం వద్ద రాష్ట్ర సంగీత, నాటక అ కాడమి చైర్మన్ బాద్మి శివకుమార్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మురళి లు గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చే శారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. కా ర్యక్రమంలో శ్రీను, పర్మటయ్య, రాంచందర్, సా యి, శ్రీకాంత్, శ్రీనివాస్ యాదవ్, నర్సింహులు, సు వర్ణ, కృష్ణ, కుమార్, జంగయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నా రు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, కలెక్టరే ట్ ఏవో ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఒక టో వార్డు తిమ్మసానిపల్లిలో వీరాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమల సప్లయర్స్ యజమాని తిరుమల వెంకటేశ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వెంకటేశ్, మహేశ్, ప్రశాంత్, వంశీ, రాము, రంజిత్, రోహిత్, చందు, ప్రవీణ్, శేఖర్, రితీష్, రాకేశ్, వినో ద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...