ఓటర్ల వివరాలు పక్కాగా ఉండాలి


Tue,September 10, 2019 12:58 AM

-వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈవో రవికుమార్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఓటర్ల వివరాలు పక్కాగా ఉండేందుకు బీఎల్‌వోలు బాధ్యతగా పని చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈవో రవికుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈనెల 30వ తేదీలోగా బీఎల్‌వోలకు ఇచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల వివరాలను సరి చేయాలని సూచించారు. ఓటర్ల వివరాల సేకరణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, కలెక్టరేట్ సీ సెక్షన్ సూపరింటెండెంట్ బాలచందర్, రమేశ్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...