అక్షరాలే ఆయుధంగా కాళోజీ కవిత్వం


Tue,September 10, 2019 12:58 AM

-తెలంగాణ భాషా దినోత్సవంలో కవి లక్ష్మణ్‌గౌడ్
స్టేషన్ మహబూబ్‌నగర్ : అక్షరాలను ఆయుధంగా మలుచుకుని అన్యాయం, ని ర్భయాలను తన కవిత్యంతో ఎండగట్టిన మహాకవి కాళోజీ నారాయణరావు అని ప్ర ముఖ కవి లక్ష్మణ్‌గౌడ్ అన్నారు. సోమవారం పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో జి ల్లా కేంద్రంలోని కళోజీ సమావేశ మందిరంలో నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, నాయకుల అన్యాయాలు, అక్రమాలను తన కవిత్వం ద్వారా ప్రజలకు తెలియజేశారని కొనియాడారు. పాలమూరు సాహితీ అధ్యక్షుడు భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ గర్వించదగిన కవి కాళోజీ అని, ఆయన కవిత్యం అధ్యయనం చేస్తే సమాజంలో సమస్యలను అధ్యయనం చేసినట్టేనని అన్నారు.

పాలమూరు కళా వేదిక అధ్యక్షుడు గుమడాల చక్రవర్తిగౌడ్ మాట్లాడుతూ కాళోజీకి పాలమూరుతో అవినాభావ సంబంధం ఉందన్నారు. అంతకుముందు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, జిల్లా గ్రంథాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం సంస్థ కార్యదర్శి మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో కవులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బాదేపల్లి వెంకటయ్య, కమలేకర్ శ్యాంప్రసాద్‌రావు, వెంకటేశ్వర్లు, బోల యాదయ్య, సృజామి, నవీన్‌కుమార్, ఖదీర్, రావూరి వనజ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...