ల్యాబ్‌ టెక్నీషియన్‌పై హత్యాయత్నం


Mon,September 9, 2019 12:40 AM

-కారును బైక్‌పై వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు
-నారాయణపై ఇనుప రాడ్లతో దాడి
-పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు
-కేసు నమోదు చేసిన పోలీసులు
కోడేరు: మండల కేంద్రమైన కోడేరులోని పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణ అనే ఉద్యోగిపై గుర్తుతెలియని దండుగులు శనివారం సాయంత్రం హత్యాయ త్నం చేసిపరారైనట్లు బాధితుడు నారాయణ ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుమేరకు సం ఘటనపై కేసునమోదు చేసి విచారణ చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణయ్య తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ నారాయణ శనివారం ఉదయం విధులకు హాజరై సా యంత్రం విధులు ముగించుకొని నాగర్‌కర్నూల్‌కు వెళ్లేందుకు ప్రధాన రోడ్డులోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద బస్సుకోసం వేచియున్నాడు. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి కారులో వచ్చి నాగర్‌కర్నూల్‌కు ఎలా వెళ్లాలని నారాయణను అడిగాడు. తాను కూడా నాగర్‌కర్నూల్‌కు వెళ్లేందుకు వేచి ఉన్నానని చెప్పడంతో అతను కారులో ఎక్కమన్నాడు. ఏవైపు వెళ్లాలని ఆ వ్యక్తి అడుగగా పెద్దకొత్తపల్లి రూట్‌లో రోడ్డు బాగుందని వెళ్దామని చెప్పి నారాయణసైతం కా రులో కూర్చున్నాడు. కోడేరు దాటి కొంత దూరం వెళ్లగానే పసుపుల శివారులో కారు ఆపారు. కారు ఆగిన ప్రదేశానికి మరో ద్వి చక్రవాహనంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారని వారు రాగానే అందరూ కలిసి నారాయణను రోడ్డుపైనుంచి కొంతదూరం వరకు తీసుకెళ్లి ఇనుపరాడ్లతో దాడి చేశారని అదేసమయానికి ఓ వ్యక్తి రావడంతో దండగులు పారిపోయారని బాధితుడు పిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణయ్య తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...