గట్టు చెన్నరాయుడి జాతర ప్రారంభం


Sun,August 25, 2019 01:18 AM

గండీడ్: దైవచింతనతో మెలిగితే ఎలాంటి దురాలోచనలు రావని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని గోవింద్‌పల్లి వరహగిరి చెన్నకేశవస్వామిని దర్శించుకుని జాతరను ప్రారంభించారు. అలాగే జూలపల్లిలో వేంకటేశ్వరస్వామి ఉత్సవాలను ప్రారంభించారు. జాతరకు గండీడ్ మండలం నుంచేకాక దోమ, కుల్కచర్ల, నారాయణపేట్ జిల్లా కోస్గి, మద్ద్దూర్ మండలాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీటి వసతి , క్యూలైన్ల నిర్వాహన చేపట్టారు. జాతరకు హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్దం గండీడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జాతర ఉత్సవాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మహ్మదాబాద్ పోలీసులు బందోస్తు ఏర్పాటు చేశారు. రాత్రికి అడుగుల భజన, అఖండ భజన, తెలవారు జామున రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీటీసీ శైలజ, నాయకలు బాలవర్ధన్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, బాల్‌రెడ్డి, దశరథ్, అమ్య్రానాయక్, ఆయగ్రామాల సర్పంచ్‌లు ఆలయ కమిటీ సభ్యులు, యువజన సభ్యులు పాల్గొన్నారు.

మహ్మదాబాద్ , జూలపల్లిలో..
మహ్మదాబాద్ గ్రామ సమీపంలోని గంగర్లపాహాడ్ ఆంజనేయ స్వామి ఆలయ దగ్గర శ్రావణ మాస ప్రాంభం నుంచి ప్రతి శనివారం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు నాల్గవ శనివారం రోజు భక్తుల తాకిడి ఎక్కవగా ఉంటుందని ఎలాంటి అసౌకర్యం కలగకుండ ఏర్పాట్లు చేశారు. స్వామి వారికి పల్లకి సేవ, ఆకుపూజ, అభిషేకం నిర్వహించారు హారతి ఏర్పాటు చేశారు.జూలపల్లిలో వెంకటేశ్వర బహ్మ్రోత్సాలను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారరంబించారు. ఇక్కడ మూడు రోజలుపాటు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శీలక్ష్మీ, ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...