సేంద్రియ ఎరువులతో పంటల సాగు చేయాలి


Sun,August 25, 2019 01:17 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : అధిక దిగుబడి సాధించేందుకు పంటల సాగులో సేంద్రియ ఎరువులు వినియోగించాలని వ్యవసాయ అధికారి హనిఫ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవనంలో కోడూర్, మణికొండ, పెర్కివీడు, మల్కాపూర్ గ్రామాల రైతులకు సేంద్రియ వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటల సాగులో రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూములు సారం కోల్పోవడంతోపాటు, పంట పెట్టుబడి అధికమవుతుందని తెలిపారు. రైతులు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో టచ్ సంస్థ కోఆర్డినేటర్ నర్సింహులు, జీఏఏ జిల్లా కోఆర్డినేటర్లు రమణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...