భక్తి శ్రద్ధలతో చెన్నకేశవ స్వామి పల్లకీ సేవ


Sun,August 25, 2019 01:17 AM

మూసాపేట : మండలంలోని కొమిరెడ్డిపల్లి గుట్టకాడిపల్లె చెన్నకేశవ స్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం పల్లకీ సేవా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాలలో దేవరకద్ర ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొని ప్ర త్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు బాజా భజంత్రీలతో స్వాగతం ఫలికారు. అనంతరం కోనేరులో గంగాదేవికి పూజలు చేసి స్వా మి వారిని దర్శించుకున్నారు. అనంత రం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఆలను పూలమాల, శాలువాతో సన్మానించారు. అలాగే, నియోజకవర్గ కాం గ్రెస్ నేత మధుసూధన్‌రెడ్డి స్వామి వా రిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. కాగా, మూడు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామస్తులతోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు కుటుంబ సమేతంగా స్వామి వారిని ద ర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

సా యంత్రం ఉద్దాల ఊరేగింపును అ త్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అ దేవిధంగా గ్రామంలోని వాహనాల ఊ రేగింపు నిర్వహించి చెన్నకేశవ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే, స్వామి వారి సన్నిధిలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని పోటా పోటీగా నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, జిల్లా డైరెక్టర్ లక్ష్మీ నర్సింహ యాదవ్, వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, స ర్పంచులు సాయిరెడ్డి, శేఖర్‌రెడ్డి, కావలి శ్రీనువాసులు, ఎంపీటీసీ సంతోషి, నా యకులు శెట్టి శేఖర్‌రెడ్డి, సమరసింహారెడ్డి, పటేల్ నర్సింహారెడ్డి, మాధవాచారి తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...