సైకాలజిస్టు లక్ష్మణ్‌కు జాతీయ అవార్డు


Sun,August 25, 2019 01:16 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ సైకాలజిస్టు లక్ష్మణ్‌కు జాతీయ అవార్డు లభించింది. ఎడ్యూకేషన్ ఐకాన్ అవార్డు ముంబైకి చెందిన టెక్‌ప్రో ల్యాబ్ సంస్థ ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సేవా ప్రముఖులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తున్నది. ఈ ఏడాదిలో మహబూబ్‌నగర్ జిల్లా వాసి సైకాలజిస్టు లక్ష్మణ్‌కు ఎడ్యూకేషన్ అవార్డును ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో మానిష్ జిందాల్, వివేకానంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...