క్రీడల్లో గెలుపోటములు సహజం


Sun,August 25, 2019 01:16 AM

-నాగర్‌కర్నూల్ జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్ జనార్దన్‌రెడ్డి
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని నాగర్‌కర్నూల్ కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ నేత జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం స్టేడియంలో సాఫ్ట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, క్రీడల్లో రాణించాలని సూచించారు. సాఫ్ట్‌బాల్ టోర్నీలో ప్రతిభ కనబర్చి క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, నాగర్‌కర్నూల్ కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి యాదయ్య, కోచ్ సాదీక్‌అలీ, వ్యాయామ ఉపాధ్యాయులు ఆనంద్, రాఘవేందర్, నాగరాజు, శ్రీనివాసులు, ఉమా, మేరి పుష్పలు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...