క్రీడా సౌరభం


Sat,August 24, 2019 01:07 AM

-అట్టహాసంగా రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీ ప్రారంభం
-శుభారంభం చేసిన మహబూబ్‌నగర్ బాలుర జట్టు

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలోని స్టేడియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ టో ర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీని జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డిలతో కలిసి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ముందుగా వా రికి విద్యార్థులు ప్రత్యేక బ్యాండ్‌తో స్వాగతం పలికారు. వివిధ జిల్లాల నుంచి టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరినీ అలరించింది. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నీలో ఆదిలాబాద్, భద్రాది కొత్తగూడెం, హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జట్ల నుంచి 640 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

క్రీడారంగం అభివృద్ధికి కృషి-మంత్రి శ్రీనివాస్‌గౌడ్
క్రీడారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. క్రీడాకారులకు గెలవాలనే తపన ఉంటేనే క్రీడల్లో రాణిస్తారన్నారు. క్రీడా కోటా విషయంపై ఆలోచిస్తున్నామని, క్రీడాకారులకు న్యాయం చేస్తామన్నారు. క్రీడల్లో రాణించే క్రీడాకారులకు అన్నివిధాలా సహకారం అందిస్తామని తెలిపారు. రూ.2కోట్ల 50 లక్షలతో స్టేడియం అభివృద్ధి త్వరలోనే చేపడతామన్నారు. అలాగే, మినీ స్టేడి యం ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి శ్రీనివా స్‌గౌడ్ తెలిపారు. ఎదిర సమీపం లో ఐటీ పార్కు ఏర్పాటు చేసి ని రుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలి-జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి
క్రీడాకారులు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో నైపుణ్యం పెంచుకొని రాణించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి అన్నారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత 70 ఏండ్లుగా మహబూబ్‌నగర్‌లో జరగని అభివృద్ధిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఐదేండ్ల కాలంలోనే చేసి చూపించారని గుర్తు చేశారు. పని చేసే నాయకుడికి ఎప్పుడూ అండగా ఉండాలన్నారు.

క్రీడల్లో రాష్ట్రం ముందుండాలి-శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి
క్రీడల్లో రాష్ట్రం ముందుండేలా ప్రతి క్రీడాకారుడూ కృషి చేయాలని శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదని, ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని తెలిపారు. ఎంతోమంది క్రీడాకారులు తెలంగాణ నుంచి జాతీయ జ ట్టుకు ప్రాతిని ధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్ర తి పీఈటీ క్రీడాకారులను దత్తత తీసుకొని క్రీడాభివృద్ధికి కృషి చేయాలన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీవైఎస్‌వో సత్యవాణి, సాఫ్ట్‌బాల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమరేందర్‌రాజు, రాజేంద్రప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, మాజీ వైస్ చైర్మన్ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, సాదీక్‌అలీ, ఆనంద్, శ్రీనివాసులు, వడెన్న, నాగరాజు, రాఘవేందర్, చెన్నవీరయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...