అభివృద్ధే మన కర్తవ్యం


Sat,August 24, 2019 01:04 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు సాగుతూ పట్టణ కేంద్రాన్ని సుందరవనంగా మార్చుకుందామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల విస్తరణ పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరానికి పాలమూరు జిల్లా కేంద్రాన్ని అద్భుతంగా తయారు చేసి అందిద్దామని పిలుపునిచ్చారు. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సురేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...