కడుపునొప్పి భరించలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య


Sat,August 24, 2019 01:03 AM

మదనాపురం (కొత్తకోట) : కడుపునొప్పి భరించలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన శ్రీనివాసులు రాధమ్మ దంపతుల మొదటి కూతురు శ్రావణి(20) స్థానిక ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ (బీకాం) రెండో సంవత్సరం చదువుతున్నది. ఈ క్రమంలో శ్రావణి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ వివిధ దవాఖానలలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నదన్నారు. ఇంటికి వచ్చిన తల్లి స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించగా అప్పటికే శ్రావణి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...