మన్యంకొండలో అఖండ భజన


Sat,August 24, 2019 01:00 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా: మండలంలోని మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శుక్రవారం ఆలయ చైర్మన్ అలహరి మధుసూదన్‌కుమార్ ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఓబ్లాయిపల్లి, కోటకదిర గ్రామస్తులు ఏటా శ్రావణమాసంలో అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఈ భజన కార్యక్రమం శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. శ్రావణ శనివారం చివరి వారంకావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటాచారి, పూజారులు, భజన బృందం తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...