వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి


Fri,August 23, 2019 02:14 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : వృత్తి విద్యా కోర్సులతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ఒకేషనల్ కళాశాల నూతన భవనాన్ని రూ.2కోట్ల 25లక్షలతో నిర్మించామని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. కాగా, జాబ్ మేళాకు మొత్తం 3200 మంది యువతీ, యువకులు హాజరు కాగా, 2086 మందిని 48 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, డీఐఈవో వెంక్యానాయక్, ప్రిన్సిపాల్స్ గోపాల్, ఊ ర్మిళ, హన్మంతు, అధ్యాపకులు నండూరి శ్రీ నివాస్, కొండయ్య, నాయకులు కోరమోని వెంకటయ్య, కృష్ణమోహన్ పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...