టీఆర్‌ఎస్‌లో 300 మంది చేరిక


Fri,August 23, 2019 02:14 AM

-గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని కమలా గార్డెన్‌లో గురువారం కాంగ్రెస్ పార్టీ నేత ధనుంజయరెడ్డితోపాటు సుమారు 300 మంది మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందరికీ అండగా నిలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణలత, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రాధాఅమర్, మల్లు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...