మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి


Fri,August 23, 2019 02:13 AM

నవాబ్‌పేట : ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలను సద్వినియో గం చేసుకొని మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సీ లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తీగల్‌పల్లి, ఫతేపూర్ మైసమ్మ దేవాలయ ఆవరణలో గురువారం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తీగలపల్లిలో నూతనంగా రూ.5 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని, శ్రీనిధి రుణాలు ఇస్తున్నారన్నారు. గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చారన్నారు. గ్రామాల్లో హరితహారంలో నాటే మొక్కలు బతికేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటకఅకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సిములు, సింగిల్‌విండో చైర్మన్ రాంప్రసాద్, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, మైసమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ పాశం గోపాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...