విద్యా ప్రమాణాలు పెంచుతాం


Thu,August 22, 2019 12:54 AM

-సర్కారు బడుల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి
-కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధనకు ఏర్పాట్లు
-పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
-మెరుగైన ఫలితాలు సాధించాలి : జెడ్పీ చైర్‌పర్సన్
-ప్రభుత్వ బడుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు

దేవరకద్ర, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం చిన్నచింతకుంట మండలం వడ్డెమాను గ్రామ సమీపంలోని రామలింగేశ్వరస్వామి కల్యాణ మండపంలో నిర్వహించిన మండలస్థాయి విద్యా అవగాహన సదస్సుకు ఎంపీతోపాటు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తెలంగాణ ప్రాం తంలోని యువతీ, యువకులు చదువుకు దూరమయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకు న్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. తెలంగాణలోని అన్ని వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. గురుకులాల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.లక్షా 25వేల చొప్పున ఖర్చు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తించి విద్యార్థుల బం గారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. పదో తరగతిలో ప్రైవేట్‌కు ధీటుగా విద్యార్థులు ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాల ని ఎంపీ సూచించారు.

క్రీడల్లోనూ రాణించాలి
-జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రతి వి ద్యార్థి చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే ఎంతటి లక్ష్యానైనా సాధించవచ్చని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్ర భుత్వం మౌలిక వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం దుస్తులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజ నం అందిస్తుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని తెలిపారు.

ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్యాబోధన
-ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం, ప్రతిభగల ఉపాధ్యాయులచే విద్యార్థులకు విద్య అందుతుందని ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయనే నమ్మకం విద్యార్థుల తల్లిదండ్రుల్లో కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముఖ్యభూమిక పోషించాలని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి రాము, కురుమూర్తి దేవస్థానం చైర్మన్ సురేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ప్రతీప్‌రెడ్డి, వజీర్‌బాబు, మోహన్‌గౌడ్, లక్ష్మణ్, సుధాకర్, మన్యంగౌడ్, కరుణాకర్‌రెడ్డి, ఉమా మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...