కలుపుమొక్క నిర్మూలనపై అవగాహన


Thu,August 22, 2019 12:50 AM

గండీడ్: వయ్యారిబామ కలుపు మొక్క ప్రధాన పంటలను దెబ్బతీసీ దిగుబడులను తగ్గిస్తుందని ఏరువాక శాస్త్ర వేత్తలు రామకృష్ణబాబు, శ్రీధర్‌లు అన్నారు. బుధవారం గండీడ్ మండలంలోని సల్కర్‌పేట్‌లో వయ్యారిబామ కలుపు మొక్కపై విద్యార్థులకు, రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటలను నాశనం చేసే ఈ కలుపు మొక్క ఎక్కడపడితే అక్కడ పెరుగుతందని ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. దీనిని రైతులు సామూహికంగా నిర్మూలన చేపడితే కొంతమేర నిర్మూలించ వచ్చన్నారు. ఈ పద్ధతులతోపాటు మొక్క పెరిగిన వెంటనే పూత రాక ముందే మొక్కలను తొలగించాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ జితేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ గిరిధర్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశం, వ్యవసాధికారి రామకృష్ణ, ఏఈవోలు, రమ్య, గౌతమి, మహేశ్, లక్ష్మీకాంత్ రైతులు తదితరుల ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...