రోటా వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి


Thu,August 22, 2019 12:50 AM

-జిల్లా ప్రోగాం అధికారి డాక్టర్ కృష్ణ
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం): ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రోటా వ్యాక్సిన్‌పై ప్రజల్లో విస్రుత్తంగా అవగాహన కల్పించాలని జిల్లా ప్రోగాం అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రోటా వ్యాక్సిన్‌పై రెండో రోజు జిల్లాలోని వైద్యసిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ రోటా వైరస్ వల్ల కలిగే మరణాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్తగా ఈ రోటా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ను వేయనున్నామని తెలిపారు. పుట్టిన బిడ్డకు ఏడాదిలోపు ఈ వ్యాక్సిన్ మూడు డోసులు వేయాలని సూచించారు. ప్రస్తుతం వేస్తున్న వ్యాక్సిన్‌లతో పాటు ఈ వ్యాక్సిన్‌ను కూడా నోటి ద్వారా వేయాలన్నారు.

ఎంసీపీ కార్డులో సూచించిన దాని ప్రకారం పిల్లలకు వ్యాక్సిన్‌ను వేయాలని తెలిపారు. అయితే పిల్లలు అనారోగ్యంగా ఉంటే వాయిదా వేయాలని, పూర్తిగా కోలుకున్న తర్వాత వేయాలన్నారు. అదే విధంగా తగిన నియామాల ప్రకారం వ్యాక్సిన్‌ను నిల్వ చేయాలని, అదే స్థాయిలో మోతాదు ప్రకార డోసులు వేయాలని సూచించారు. ప్రతి ఒక్క చిన్నారి వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి డాక్టర్ ఉమా, జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లాలోని వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...