సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు


Wed,August 21, 2019 02:10 AM

మద్దూరు : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్య లు తీసుకుంటామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పర్యటనలో భాగంగా మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామాల వారీ సర్పంచులతో ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగాను నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మారాయని తెలిపారు. మండలంలో అసంపూర్తి పనులపై మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ జిల్లా స్థా యి అధికారులు, సర్పంచులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తాగునీటీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల అనంతరం గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సర్పంచులకు చెక్ పవర్‌పై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడనున్నట్లు ప్రకటించారు. పాత పద్ధతిలోనే చెక్ పవర్‌పై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో చర్చించనున్నట్లు తెలిపారు. మండలంలో వివిధ గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి గ్రామానికి రూ. ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ఎంపీ, ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు మండలంలోని నాగిరెడ్డిపల్లిలో ఇటీవల విద్యుత్ ప్రమాదంతో మృతి చెందిన మరికంటి ప్రభుదాస్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పట్నం పరామర్శించారు. అలాగే అస్వస్థతకు గురైన టీఆర్‌ఎస్ నాయకులు సలీం తల్లి జులెకమ్మను పరామర్శించారు.

అనంతరం మండలంలోని రెనివట్ల, అప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.అనంతరం మండల కేంద్రంలోని గీతాంజలి ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీధర్, తాసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు పెద్ద వీరారెడ్డి, నాయకులు సలీం, వీరేశ్‌గౌడ్, శివకుమార్, వీరారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జనార్దన్, బాల్‌చందర్‌గౌడ్, రాములుగౌడ్, నర్సిములు, ఎంపీటీసీలు వెంకటయ్య, ఏకే రాజు, సర్పంచులు అరుణ, వంచర్ల గోపాల్, భవాని, వెంకటయ్య పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...