27న శ్రమదానం : కలెక్టర్ వెంకట్రావు


Wed,August 21, 2019 02:10 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : నారాయణపేటను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ఒక రోజు శ్రమదానం చేపట్టాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ వల్ల ప్రమాదాలు రాకుండా, ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా, కా ల్చి వేయడం కాని, భూమిలో పాతి పెట్టడడం కాని చేయాలన్నారు. ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కల్పించుటకు ఈ నెల 27వ తేదీన శ్రమదాన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. శ్రమదానంలో ప్లాస్టిక్ ఫ్రీ పై సరైన అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఏర్పడకుండా చర్యలు తీసుకొనుటకు ఈ శ్రమదానం కింద ప్లాస్టిక్ అంతటిని తీసివేసి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని తెలిపారు. శ్రమదాన కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, సహాయ సిబ్బంది, అన్ని పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా, మెప్మా ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు అందరూ పాల్గొనాలని తెలిపారు. జిల్లాలోని మూడు మున్సిపాల్టీలలో కమీషనర్లతో పాటు ప్రజాప్రతినిధులు ప్లాస్టిక్ ఫ్రీ జిల్లాపై అవగాహన కల్పించాలని తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...