పరస్పర సహకారంతోనే ముందడుగు


Wed,August 21, 2019 02:10 AM

మహబూబ్‌నగర్ లీగల్ : బార్-బెంచ్ సత్సంబం ధాలను కొనసాగించడంలో మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ ప్రముఖపాత్ర పోషిస్తుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జీ వీ సుబ్రమణ్యం అన్నారు. రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన శౌకత్ జహర్ సిద్దిఖ్ స్వాగత కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరిస్తున్న తీరు బాగుందని అన్నారు. ఇలా ఉండటం వల్ల కేసులను సత్వరమే పరిష్కరించేందుకు వీలు ఉంటుందని చెప్పారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తికి కూడా న్యాయవాదులు ఎప్పటిలాగే వారి సహకారాన్ని అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి రఘురాం, ఏడవ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి అజిత్ సింహారావు, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి వసంత్, న్యాయసేవాధికార సంస్థ న్యాయమూర్తి కె.చంద్రశేఖర్‌రావు, జూనియర్ సివిల్ జడ్జి దీప్తి, మొబైల్ కోర్టు న్యాయమూర్తి తేజోకార్తీక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళీ కృష్ణ, ఉపాధ్యక్షుడు రాజభాస్కర్, కార్యదర్శి సోమిరెడ్డి లకా్ష్మరెడ్డి, జగదీశ్వర్, అవేజ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ కార్యవర్గం ఘనంగా స్వాగతం పలికింది.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...