రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో క్రీడాకారులకు మెడల్స్


Wed,August 21, 2019 02:10 AM

వనపర్తి క్రీడలు : ఇటీవలే హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 6వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలలో అండర్-16, 18, 20 విభాగాల్లో 10 మెడల్స్‌ను జిల్లా క్రీడాకారులు సాధించారు. మంగళవారం పట్టణంలోని బాలకిష్టయ్య క్రీడామైదానంలో సాయంత్రం రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ చైర్మన్ బోలమోని లక్ష్మయ్య అభినందించారు. అనంతరం క్రీడాకారులకు ఆయన చేతుల మీదుగా మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులలో టీ విష్ణు, జే సంతోశ్ కుమార్, యం కృష్ణ, సంతోశ్, వీ వినోద్ నాయక్, రెలే టీం, సుజాత, సీ రాఘవేంద్ర, ఆర్ ప్రకాశ్, సంజీవ్, సునీల్‌కుమార్, నవీన్ ఉన్నారు. ఈ క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోలమోని నరసింహ్మా, కార్యనిర్వాహక కార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు శంశీర్, శ్రీనివాస్‌రెడ్డి, టీం మేనేజర్ రాజేశ్, కోచ్ రాము, హాకీ అకాడమీ పర్యవేక్షకులు వినయ్, భరద్వాజ్, లక్ష్మణ మూర్తి, కానిస్టేబుల్ నారాయణ తదితరులు అభినందించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...