ఆదర్శ కళాశాలలో పాములపై అవగాహన


Wed,August 21, 2019 02:08 AM

స్టేషన్ మహబూబ్‌నగర్: పట్టణ కేంద్రంలోని ఆదర్శ, పీజీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు పాములపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంవీఎస్ డిగ్రీకళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ పరమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిపై ఉన్న రకరకాల పాములు వాటి లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ఉనికిని గురించి తెలుసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో పాములు కూడా భాగస్వామ్యులేనన్నారు. మానవుడికి ఉన్న మూఢనమ్మకాలు, అపోహలు, భయం కారణంగా సర్పజాతి నాశనమవుతుందని తెలిపారు. పాముల సంచారాన్ని ఎలా పసిగట్టాలి. పాములు కరిస్తే కరిచిన పాము విషపూరితమా లేక విష రహితమైనదా? ఏ విధమైన చికిత్స అందించాలి. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం నీటి పాము, నాగుపాము, జర్రిపోతు, కట్లపాము, రక్తపింజర, కొండచిలువ మొదలైన పాములను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు నర్సింహారెడ్డి, అరుణ్‌రెడ్డి, కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...