లెక్క పక్కాగా ఉండాలి.. ప్రతి మొక్కా పెరగాలి


Wed,August 21, 2019 02:07 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: హరితహారంతోపాటు ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నివేదికలను మండల, గ్రామ అధికారులు అందిస్తున్న లెక్కలు పక్కాగా ఉండాలని ప్రత్యేక శిక్షకులు, ఎంపీడీవో చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నవాబ్‌పేట, జడ్చర్ల మండల అధికారులకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. నాటిన ప్రతి మొక్క లెక్క అధికారుల దగ్గర ఉండాలని, నాటిన మొక్క పెరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటూ ముందుకుసాగాలని తెలిపారు. హరితహారం, పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా పనులు చేయాలన్నారు. ఇబ్బందులు ఉంటే ఉన్నత అధికారులకు తెలియజేయాలన్నారు. కావాలని పనుల్లో నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల, నవాబ్‌పేట మండల అధికారులు, తదితరులు ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...