రెట్టింపు ఉత్సాహం


Fri,July 19, 2019 03:42 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : నిరుపేదలకు నీడనిస్తూ నిస్సయస్థితిలో జీవనం సాగిస్తున్న వారందరికీ అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆసరా పథకానికి అంకుర్పారణ చేసిన విషయం విధితమే. తెలంగాణ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.200 పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేసింది. వికలాంగులకు రూ.1500లు చేసింది. దీంతో లబ్ధిదారుల జీవన స్థితి మెరుగు పడేందుకు ఎంతో దోహదపడింది. రోజు రోజుకు ఖర్చులు పెరుగుతున్నాయని, వృద్ధులు, వితంతువుల, వికలాంగులు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీతా కార్మికులకు ప్రతి నెలా ఆసరా ద్వారా అందిస్తున్న పింఛన్లను రెట్టింపు చేస్తోంది. దీంతో వృద్ధులకు రూ.2016, వికలాంగులకు రూ.3016ల ను అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. లబ్ధిదారుల్లో రెట్టింపు సంతోషం కనిపిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులకు ప్రొసిడింగ్‌లు జారీ చేస్తూ ఈ నెల 20న ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. 21న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు సన్నహాలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 98,703 మంది లబ్ధిదారులు ఆసరా పొందుతున్నారు. దీంతో బిడ్డలపై ఆధారపడకుండా వృద్ధులు సంతోషంగా జీవిస్తున్నారు.

మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిజం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గరిష్ట కాలం ఎన్నికల కోడ్ కారణంగా పెంచనున్న పింఛన్లు లబ్ధిదారులకు అందలేదు. కోడ్ ముగియడంతో పెం చిన పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఖాతాల్లో పెంచిన పింఛన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుతుండడంతో ప్రజలు గ్రామాల్లో సంతోషంగా చర్చింకుంటున్నారు. నెల 21న గ్రామ, మండల, జిల్లా రాష్ట్ర స్థాయిలో రెటింపు పింఛన్ల పండుగ సంబురానికి తెలంగాణ రాష్ట్రం వేదిక కానుంది.

20న ప్రత్యేక సమావేశాలు
పెంచిన పింఛన్ల లబ్ధిదారులతో జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే అధికార యంత్రాంగం ఈ పనిలో నిమగ్నమై ముందుకు సాగుతోంది. ఈ సమావేశాలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ చైర్మన్ స్వర్ణలత, ఎమ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.

జిల్లాలో 98,703 మంది లబ్ధిదారులు
జిల్లా వ్యాప్తంగా ఆసరా పథకం పింఛన్ల కోసం ఒకటి తారీఖు వస్తే చాలు పంఛన్ల కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయనున్నది. జిల్లా వ్యాప్తంగా 98,703 మందికి రెట్టింపు పింఛన్లు అందనున్నాయి.

పెరిగిన 11,008 మంది వృద్ధులు
తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య వయస్సును తగ్గించి పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. వృద్ధులు 57 ఏళ్లు పైబడి ఉంటే వృద్ధాప్య పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకున్నది. ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారుల సమాచారం సేకరించారు. గతంలో 64 సంవత్సరాలు పైబడి ఉన్నవారు జిల్లాలో 41,838 మంది వృద్ధులు ఉన్నారు. ప్రస్తుతం వయస్సు మరింత తగ్గించడంతో కొత్తగా 11,008 మంది వృద్ధులు పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 52,841 మంది వృద్ధులకు పింఛన్లు అందనున్నాయి.

ప్రతినెలా 11,56,77000 పంపిణీ
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 98,703 మంది లబ్ధిదారులకు రూ.11,56,77000 డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం జూన్ మాసం నుంచి పెంచిన పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం తో ప్రతి నెల దాదాపుగా రూ.23,13,54000లు లబ్ధిదారులకు అందుతాయి. ఈ క్రమంలో రెట్టింపు పింఛన్లు చేతికి వస్తుండడంతో లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపు పింఛన్లతో తమ జీవితాల్లో వెలుగు నిండుతాయని సంబుర పడుతున్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...