మున్సిపోల్స్‌లో..ఏం చేద్దాం..!


Fri,July 19, 2019 03:38 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి : వరుసగా జరిగిన ఎన్నికలలో పరాజయాలను మూటకట్టుకున్న ప్రతిపక్షాలు రానున్న మున్సిపోల్స్‌లో ఏం చేద్దామని పరేషాన్‌లో పడ్డాయి. శాసనసభ, పార్లమెంట్, గ్రామపంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలు ఏవి వచ్చినా అధికార టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతతో ఘనవిజయాలను సాధించి గులాబీ జెండాలను రెపరెపలాడించింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ కారు వేగాన్ని అందుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు తమతమ పార్టీల విలువలకు తిలోదకాలు ఇచ్చి టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే ప్రయత్నాలు చేసిన ప్రయోజనాలు లేకపోవడంతో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసిన, ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ను ఢీకొనే పరిస్థితులు లేక ఆయా పార్టీల నాయకులంతా మున్సిపోల్స్‌లో ఏం చేద్దామని తమతమ ఆలోచనలు ఆరంభించారు.

గత అసెంబ్లీ నుంచి జతకలసిన పార్టీలు
ఆరునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచే జాతీయ స్థాయిలో బద్ధ శత్రువులైన రాజకీయ పార్టీలు నారాయణపేట జిల్లాలో మాత్రం తమ తమ పార్టీల నైతిక విలువలను మరిచి ఎన్నికలలో సమైక్యంగా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొంటున్నారు. నారాయణపేట ని యోజకవర్గంలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా పోటీచేసిన శివకుమార్‌రెడ్డికి తమ పార్టీ అభ్యర్థిని కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. మక్తల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తమ అభ్యర్థికి కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమతమ పార్టీల అభ్యర్థులకు కాకుండా స్వతంత్య్ర అభ్య ర్థి జలందర్‌రెడ్డికి మద్దతును ఇచ్చారు. అయిన్నప్పటికినీ ఈ రెండు నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా రంగంలో ఉన్నా రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. గత ఎంపీ ఎన్నికలలోనూ నారాయణపేట నియోజకవర్గంలోని కాంగ్రె స్ పార్టీ ముఖ్యనాయకులు కార్యకర్తలందరూ తమ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి మద్దతు పలికారన్న ఆరోపణలు ఉన్నాయి.

తేటతెల్లం చేసిన స్థానిక ఎన్నికలు..
జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏకమై టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనే ప్రయత్నాలు చేశాయని ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికలు గ్రామపంచాయితీల ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎవరికి వారిగా అభ్యర్థులను పోటీలో ఉంచితే టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొలేమన్న భయంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏకమై అభ్యర్థులను పోటీలో నిలిపాయి. నారాయణపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పొత్తు విధా నం కొనసాగింది. అయిన్నప్పటికిని జి ల్లాలోని అన్ని మండలాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందింది. ధన్వాడ మండలాన్ని మాత్రం కాంగ్రె స్, బీజేపీ కూటమి గెలుచుకోగల్గింది. మిగితా అన్ని స్థానాలలోనూ కాంగ్రెస్, బీజేపీ కూటమికి ఘోరపరాజయాలు ఎదురుకావడంతో ఆయా పార్టీల నాయకులు ఆత్మపరిశీలనలో పడ్డారు.

మున్సిపోల్స్‌పై ఆలోచనలు..
ఒంటరిగా పోటీచేసిన జట్టుగా కలిసి పోటీచేసిన టీఆర్‌ఎస్‌ను ఢీకొనే సత్తాలేకపోవడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఏంచేద్దామని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడిగా పోటీచేస్తే ప్రజ లు ఆదరిస్తారన్న నమ్మకం లేక, ఒంటరిగా పోటీచేసి గెలుపులపై నమ్మకం లేక ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పరేషాన్‌లలో ఉన్నట్లు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికలలో కలిసి వెళ్లడమా..? ఒం టరిగా పోటీచేద్దామా అన్న విషయంపై జిల్లాకు చెందిన ప్రతిపక్ష పార్టీలకు చెం దిన జిల్లా నాయకులు ఆయా పార్టీల ముఖ్య నాయకులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...