సర్కార్ బడులపై నమ్మకం పెంచాలి


Fri,July 19, 2019 03:38 AM

ఊట్కూర్ : మెరుగైన విద్యా బోధనతో సర్కార్ బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెంచేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రవీందర్ ఉపాద్యాయులకు సూచించారు. ఇటీవల నారాయణపేట జిల్లా డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం మొట్ట మొదటి సారి స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాద్యాయుల వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుని స్పందనను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో నూటికి 99 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల ఉపాద్యాయులను అభినందించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన చేపట్టాలని, ప్రభుత్వ బడుల్లోనే నాణ్యత కలిగిన విద్యా బోధన ఉంటుందనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కలిగించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాల సమస్యలపై డీఈవో దృష్టికి తీసుకురాగా త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రత్నమాల, జ్యోతిర్మయి, ఉమ, పుష్ప, షాహిన్, పీఈటీ కృష్ణవేణి తోపాటు గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...