పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల


Thu,July 18, 2019 04:14 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పనులను వేగవంతం చేశారు. మంగళవారం వార్డుల వారీగా ఓటర్ల జాబితా కులాల వారీగా వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెరిగిన వార్డులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో గతంలో 41వార్డులకు సంబంధించి 196 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం వార్డుల విభజనలో భాగంగా 49 వార్డులు పెరగడంతో పట్టణ కేంద్రంలో ఎన్నికల నిర్వహణ కోసం 230, భూత్పుర్ మున్సిపాలిటీలో 10 వార్డులకు 20 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఒక్కోక్క వార్డులో 4నుంచి 5 పోలింగ్ కేంద్రాలను మించకుండా ఓటర్ల సంఖ్యను బట్టి బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను మున్సిపాల్టీ, ఆర్డీవో, తాసిల్దార్, పోస్టాఫీసు కార్యాలయాల్లో ప్రచురించారు. దీనిపై పోలింగ్ కేంద్రాలు ముసాయిదాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 19 లోగా మున్సిపల్ కార్యాలయంలో స్వీకరించనున్నారు. అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించనున్నారు.

ఇప్పటికే ఓటరు జాబితా విడుదల..
పట్టణ కేంద్రంలోని 49 వార్డుల వారీగా ఓటర్ల జాబితా, కులాల వారీగా వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం వార్డుల్లో 1,67,149 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 83,574, మహిళలు 83,571, ఇతరులు 4 ఉన్నారు. ఇందులో బీసీలు 1,25,509, ఎస్సీలు 10,378, ఎస్టీలు 5,436 మంది ఉన్నారు. దాదాపు 75% మంది బీసీలు ఉన్నారు. భూత్పుర్ మున్సిపాలిటీలో 10,017 ఓటర్లకు గాను పురుషులు 4,988,మహిళలు 5,029 ఉండగా, బీసీలు 6804, ఎస్సీలు 1505, ఎస్టీలు 1515 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా కులాల వారీగా వివరాలను ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వివరాలు వెల్లడించారు. ఇక మిగిలింది రిజర్వేషన్ల ప్రక్రియనే. ఇప్పటికే వార్డుల్లో ఆశావాహులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ పట్టణంలో జరిగిన అభివృద్ధినే ఎజెండగా పెట్టుకొని ముందుకు వెళ్లనుంది.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...