అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాము లు కావాల


Wed,July 17, 2019 05:54 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : జిల్లా కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాము లు కావాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సాగర కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతోపాటు, న్యూటౌన్‌లో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, గణేశ్ నగర్‌లో నూతనంగా ఏ ర్పాటు చేసిన బోరుమోటరు, పాల్‌సాబ్ గుట్టలో మి షన్ భగీరథ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులు కళ్లముందు కనిపిస్తున్నాయని వివరించారు. పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేసి నీటి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రతి వార్డు తిరిగి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని వార్డుల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అలాగే, పట్టణ అంతర్గత రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రధాన కూడళ్ల అభివృద్ధి చేపడతామన్నారు. పెద్ద చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు, న్యూటౌన్ వరకు లక్కవరం బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన రోడ్డు విస్తరణ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే బైపాస్ రోడ్డు పనులు చేపడుతున్నామన్నారు. పట్టణ అభివృద్ధే తమ ముందున్న లక్ష్యమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు, మాజీ కౌన్సిలర్లు కోరమోని జ్యోతి, పద్మజాయాదవ్, కృష్ణమోహన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్, నాయకులు బుక్కా మోహన్‌బాబు, బాల్‌రాజ్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

చదువుతోనే బంగారు భవిష్యత్తు
l మంత్రి శ్రీనివాస్‌గౌడ్ l విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ
స్టేషన్‌మహబూబ్‌నగర్ : చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట, మహాత్మగాంధీ రోడ్డు స్కూళ్ల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మహాత్మగాంధీ రోడ్డు స్కూల్ విద్యార్థులకు పారిశ్రామిక వేత్త సుధాకర్ ఆచారి నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ రాములు,మాజీ కౌన్సిలర్ షాకత్‌అలీ, నాయకులు బుక్క మోహన్‌బాబు, రాజేశ్, ముత్యాల ప్రకాశ్, చంద్రకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...