నేడే విడుదల


Tue,July 16, 2019 05:00 AM

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు వే గవంతంగా సాగుతోంది. అందులో భాగంగా ఈ నెల 11న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయ గా, మంగళవారం తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. ఫొటోలతో కూడిన ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాల్లో ఇప్పటికే ప్రచురించారు. ఈ జాబితాపై ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసింది. గురు, శుక్రవారాలు అభ్యంతరాలను స్వీకరించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ నెల 14న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా వి డుదల చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలపై పలు అభ్యంతరాల నేపథ్యంలో ఎన్నికల సంఘం మరో రెండు రోజుల పాటు పొడిగించింది. ఇ ప్పటికే మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారు, వివిధ రాజకీయ పక్షాలు, ఓటర్లు, తుది ఓటర్ల జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేపట్టారు. ఒక్కో వార్డులో 4 నుంచి 5 వరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్‌లో సుమారు 250, భూ త్పూర్‌లో దాదాపు 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు ఎన్నికలకు ఏ ర్పాట్లు శరవేగంగా సాగుతున్నా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు మాత్రం రిజర్వేషన్లపై మరికొన్ని రో జులు ఆగాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీ సుకురావాలని భావిస్తున్న కొత్త మున్సిపల్ చట్టం ఏ ర్పాటైన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయించారు. దీంతో ఏ వార్డు ఎవరికి కేటాయిస్తారో, చై ర్మన్ స్థానం ఎవరికి రిజర్వేషన్ అవుతుందో అనే సందేహాలకు ఇంకా సమాధానాలు లభించడం లేదు. ఉత్కం ఠ కొనసాగుతూనే ఉంది.

నేడు ఓటర్ల తుది జాబితా విడుదల
జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో నేడు ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. నిర్ణయించిన మేరకు ఈ నెల 14న తు ది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తా యి. తమ పేర్లు గల్లంతయ్యాయని, పేరు, కులం పేరు తప్పుపడిందని పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తప్పులు లేకుండా ఓటర్ల జాబితా ప్రచురించేందుకు ఎన్నికల సంఘం 2 రోజుల సమయమిచ్చింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాలను పరిశీలిస్తూ మున్సిపల్ యంత్రాంగం మంగళవారం తుది ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 11న ఓటర్ల ముసాయిదా విడుదల చేయగా, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఓటరు జాబితాలో తప్పులపై కేవలం 8 ఫిర్యాదులు మాత్రమే అందాయి. భూత్పూర్ మున్సిపాలిటీలో 14 ఫిర్యాదులు అందా యి. ఫిర్యాదులను స్వీకరించి తుది ఓటరు జాబితా విడుదలకు యంత్రాంగం సిద్ధమైంది. మహబూబ్‌నగ ర్, భూత్పూర్ మున్సిపాలిటీలో పరిధిలో 59 వార్డుల్లో 176963 మంది ఓటర్లున్నారు.

20న పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 49 వార్డుల పరిధిలో వార్డుకు సుమారు 4 నుంచి 5 పోలింగ్ కేంద్రాలు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. భూత్పూర్‌లో సు మారు వార్డుకు 2 చొప్పున 20 పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేయనున్నారు. ఈ మేరకు యంత్రాంగం ఏ ర్పాట్లు చేస్తోంది. 17న అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రచురిస్తారు. తర్వాత రెండు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 20న పో లింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల చేస్తారు.

పురపాలక చట్టం తర్వాతే రిజర్వేషన్లు
రాష్ట్రంలో ఇప్పటికే నూతన పంచాయతీరాజ్ చట్టా న్ని తీసుకొచ్చిన సర్కారు, త్వరలో కొత్త పురపాలక చ ట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యం లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే మున్సిపాలిటీ ల రిజర్వేషన్లు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. నేడు ఓటర్ల తుది జాబితా, ఈ నెల 20న పోలింగ్ కేంద్రాల జాబితా పూర్తవుతున్న తరుణంలో ఇక రిజర్వేషన్ల ప్రకటనే తరువాయి అనుకుంటున్న నేపథ్యంలో మరింత ఆలస్యం అవుతుండటంతో పురపాలక ఎన్నిక ల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహుల్లో ఉ త్కంఠ మరింత పెరిగింది. ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందో..మున్సిపాలిటీ చైర్మన్ పదవి రిజర్వేషన్ ఎవరికి అనుకూలంగా వస్తుందో తెలియక టెన్షన్‌తో తలలు ప ట్టుకుంటున్నారు. త్వరగా రిజర్వేషన్లు ఖరారు అయితే పోటీకి రంగం సిద్ధం చేసుకుందామని భావిస్తున్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...