విద్యార్థులు ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలి


Tue,July 16, 2019 04:53 AM

జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లకా్ష్మరెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలోని ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలలను ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులతో రాణిస్తున్నారని, విద్యార్థులు బాగా చదివి కళాశాలకు, ఈ ప్రాంతానికి మంచి పేరుతేవాలని సూచించారు. బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో గత ఏడాది మధ్యాహ్న భోజనం అందించడం జరిగిందని, యూనిఫాం కూడా ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. కళాశాలలో మద్యాహ్నభోజనం అందిచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సేవాభావం అలవర్చుకోవాలని, పరిశుభ్రతపై తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కళాశాలలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కళాశాల ఆవరణలో నిల్వ ఉన్న వర్షపునీటిపై ఎమ్మెల్యే మట్టి వేయించాలని పురపాలక కమిషనర్ సునితకు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీతనాటక అకాడమి చైర్మన్ బాద్మి శివకుమార్, గోవర్ధన్‌రెడ్డి, పిట్టల మురళి, మాజీ సర్పంచులు, పురపాలక కమిషనర్ సునిత, కళాశాలల ప్రిన్సిపాళ్లు కృష్ణ, నసీమ్‌సుల్తానా, ప్రశాంత్‌రెడ్డి, పర్మటయ్య, రవిశంకర్, చాంద్‌ఖాన్, కొంగళిజంగయ్య, చైతన్య, లత, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...