పాలమూరును మహానగరంగా మారుస్తాం


Mon,July 15, 2019 01:06 AM

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ: మహబూబ్‌నగర్‌ను వెనుకబడిన జిల్లాగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే మహానగరంగా రూపురేఖలు మారుస్తానని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం తెలంగాణ టూరిజంలో భాగంగా చార్మినర్‌ నుంచి మహబూబ్‌నగర్‌లోని మయూరి పార్క్‌ వరకు 300 మంది హైదరాబాద్‌ నగర ప్రముఖులు బైక్‌ రైడింగ్‌తో మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వారితోపాటు బైకు నడుపుకుంటూ జిల్లాకు వచ్చారు. మహబూబ్‌నగర్‌కు చేరుకున్న అనంతరం వారందరికి మయూరి ఏకో పార్కులో ఏర్పాటు చేసిన అభివృద్ధిని చూపించారు. ఈ సందర్భంగా మయూరి పార్కులో ఈ బైక్‌ రైడర్స్‌తో కలిసి కేక్‌ కట్‌చేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా నుంచి నేడు అభివృద్ధి చెందుతున్న జిల్లాగా పేరు వచ్చిందన్నారు. హైదరాబాదులోని ది బైకర్‌ 16 సంవత్సరాలు మారదన్‌ సందర్భంగా వివిధ అధునాతన మోటారు బైకులపై బైక్‌ రైడర్స్‌ జిల్లాకు చేరుకున్నారన్నారు. ఢిల్లీ నుంచి వివిధ దేశాలలో తిరుగుతున్న ఈ బైక్‌రైడర్స్‌ ప్రపంచ వ్యా ప్తంగా రూ.4లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారన్నారు.

భారతదేశం లో, తెలంగాణలో ఎ న్నో రాష్ర్టాలలో బైక్‌రైడింగ్‌ చేశారన్నారు. అందులో భాగంగానే బైక్‌ రైడింగ్‌ చార్మినర్‌ నుంచి జి ల్లాకు నిర్వహించామన్నారు. మహబూబ్‌నగర్‌కు చ రిత్ర చాలా గొప్పదని, హైదరాబాద్‌ బైక్‌ రైడర్స్‌ క్లబ్‌ స భ్యులు తెలుసుకొని జిల్లాను సందర్శించేందుకు పెద్దసంఖ్యలో వచ్చాను. 72ఏళ్ల వ్యక్తి సలీమ్‌ బైకు నడుపుకుంటూ చార్మినార్‌ నుంచి ఇక్కడికి రావడంపై ఆయనను అభినందించారు. ఈ బైక్‌ ర్యాలీ నిర్వహించడానికి గల కారణం పాలమూరులో జరుగుతు న్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో మంది యువకులు హెల్మె ట్‌ లేకుండా వాహనాలు నడపడం వల్ల రోడ్లపై మృత్యువాత పడుతున్నారని వారికి అవగాహన కల్పించేందుకు హెల్మెట్‌దారణ ప్రజలకు ఎంతో ముఖ్యమని సూచించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క రూ హెల్మెట్‌ ధరించి వాహనా లు నడపాలన్నారు. కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకటయ్య, రవీందర్‌రెడ్డి, గుబ్బ శివకుమార్‌, సుదీప్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజారోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన మెగా హెల్త్‌ క్యాంపును మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజ లు ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న వైద్యసేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వై ద్య శిబిరం నిర్వాహకులు పాల్గొన్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...