పాలమూరులో వర్షం


Mon,July 15, 2019 01:05 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ/నారాయణపేట టౌన్‌: పట్టణ కేంద్రంలో ఆదివారం రాత్రి 8:30గంటలకు వర్షం కురిసింది. దాదాపు 30 నిమిషాలపాటు వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందు పడ్డారు. డ్రైనేజీల్లో, రోడ్డుపై నీరుపారింది. వారం రోజులుగా వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలకు..వర్షంతో వాతావరణం చల్లబడింది. ఈ నెలలో పట్టణ కేంద్రంలో ఇదే పెద్ద వర్షం. అలాగే నారాయణపేట జిలాంలోని కోస్గి మండలంలో 1.4 మి.మీ, మాగనూర్‌ 15.0, మక్తల్‌ 17.0, ఊట్కూరు 7.4, నర్వ 11.2, ధన్వాడ 18.4, నారాయణపేట 8.2, క్రిష్ణ 8.8 మి.మీల వర్షపాతం నమోదైంది. వాన కోసం.. వనభోజనాలు
మూసాపేట: వరుణుడు కురవాలని కోరుతూ పల్లె ప్రజలు వనభోజనాలు చేశారు. ఆదివారం మండలంలోని కొమిరెడ్డిపల్లి, పోల్కంపల్లి, తిమ్మాపూర్‌ గ్రామాల్లో ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలు గ్రామాలను వడిచి పంట పొలాల బాట పట్టారు. కుటుంబ సమేతంగా వారివారి పంటపొలాల వద్దకు వెళ్లి అక్కడే వంటలు వండుకొని కుంటసమేతంగా వనభోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు వరుణ దేవుడికి పుజలు నిర్వహించి వర్షం కురింపించి కరుణించాలని కోరుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు గ్రామాలను విడిచి పంట పొలాలకు వెళ్లడంతో గ్రామాలన్నీ నిర్మాణుశంగా మారాయి. గ్రామాల్లో ఎలాంటి దొంగతనాలు జరగకుండా మూసాపేట ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్‌ ఆదేశాలతో పోలీసు సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు గస్తీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పోల్కంపల్లి తూము శ్రీకాంత్‌రెడ్డి, కొమిరెడ్డిపల్లి సాయిరెడ్డి, తిమ్మాపూర్‌ యాదమ్మ, ఎంపీటీసీలు సుకన్య, సంతోషితోపాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...