సీసీరోడ్డు పనులు ప్రారంభం


Mon,July 15, 2019 01:04 AM

గండీడ్‌: గ్రామాల అభివృద్ధ్దికి పార్టీలకతీతంగా పాటుపడాలని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం గండీడ్‌ మండల పరిధిలోని ఆశిరెడ్డిపల్లికి మట్టిరోడ్డు వేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఇబ్బందులు పడేవారన్నారు. వారి ఇబ్బందులనే దృష్టిలో పెట్టుకుని మాజీ జెడ్పీటీసీ లక్ష్మి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రూ.4 లక్షలు నిధులను మంజూరు చేయించడంతో రోడ్డు పనులు చేపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించందన్నారు. మండలంలోని ఏడు తండాకుల బీటీ రోడ్లు మంజూరయ్యాయని, ఇవియే కాకా మరోరెండు జిన్నారంతండా, గోవింద్‌పల్లి, ఆముదాలగడ్డతండా గ్రామాలకు మంజూర్‌ అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మమ్మ, మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, చంద్రయ్య, నాయకులు జంగాల వెంకటయ్య, మల్లయ తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...