‘ఆదర్శ’లో సిబ్బందికి దరఖాస్తుల ఆహ్వానం


Mon,July 15, 2019 01:04 AM

గండీడ్‌: వెన్నాచేడ్‌ ఆదర్శ పాఠశాల అనుబంధ వసతి గృహంలో పని చేయుటకు సిబ్బంది కావాలని ప్రిన్సిపాల్‌ కొండల్‌రావు తెలిపారు. పాఠశాలకు అనుబంధంగా ఈ సంవత్సరం నుంచి వసతి గృహం ప్రారంభించడం జరిగిందన్నారు. వసతి గృహంలో పని చేయుటకు వార్డెన్‌, ఉమెన్‌ స్వీపర్‌, నర్సు, వంటమనిషి, సహాయ వంట మనుషులు ఇద్దరు అవసరం ఉందన్నారు. వార్డెన్‌కు అర్హత ఏదైన డిగ్రీ, బీఎడ్‌, వేతనం రూ.6700, ఉమెన్‌ స్వీపర్‌కు చదవడం రాయడం వచ్చి ఉండాలి వేతనం రూ.6700, నర్సు అర్హత ప్రభుత్వ అర్హతలు ప్రకారం అర్హత కల్గి ఉండాలి వేతనం రూ.6వేలు స్థానికులై ఉండాలి. వంట మనిషికి అనుభం ఉండాలి వేతనం రూ.6000, సహాయ వంట మనుషులకు వేతనం రూ.5000 ఉంటుందన్నారు. పై ఉద్యోగాలన్నింటికి మహిళలు అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. వయస్సు 25 నుంచి 40ఏండ్లలోపు ఉండాలని.. ఆసక్తిగలవారు ఈనెల16వ తేదీన పాఠశాలలో దరఖాస్తు అందజేయాలన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...