గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి


Sun,July 14, 2019 01:11 AM

మహబూబ్‌నగర్ క్లాక్‌టవర్ : రాష్ట్రంలోని గిరిజనుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభకనబర్చిన గిరిజన విద్యార్థులకు శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళా భవన్‌లో పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం హాస్టల్, ఇతరత్రా భవనాల కోసం రూ.14 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి ఎ వరి తండాలను వారే పాలించుకునేలా ప్రభుత్వం చ ర్యలు తీసుకుందన్నారు. ఒక్క హన్వాడ మండలంలోనే 16 తండాలను పంచాయతీలుగా చేశామన్నా రు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గిరిజన భవనం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 కోట్లు మం జూరు చేయడంతోపాటు, ఐదెకరాల భూమిని కేటాయించారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్టడీ సెంటర్ ఏర్పాటు చే యడానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి హా మీ ఇచ్చారు. అనంతరం పురస్కారాలు అందుకున్న విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులను మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎ స్ నాయకులు బెక్కెం జనార్దన్, బాలానగర్ జెడ్పీటీ సీ, కళ్యాణి లక్ష్మణ్‌ణాయక్, ఎస్సీ, ఎస్టీ కమీషన్ స భ్యులు రాంబాబు, డాక్టర్ శేఖర్, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవుజానాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, టీఎన్‌జీవో ఉపాధ్యక్షుడు చంద్రానాయక్, రాంలాల్‌నాయక్, గో విందునాయక్, ఏఐబీఎస్ జిల్లా అధ్యక్షులు పరుశ రాం నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ నాయక్, గో పాల్, హతీరాంనాయక్, వెంకట్రాములు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...